పదో తరగతి పరీక్షా ఫలితాలపై కీలక అప్‌డేట్

పదో తరగతి పరీక్షా ఫలితాలపై కీలక అప్‌డేట్

AP: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఈనెల 16 నుంచి ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 2న ముగియనున్నాయి. జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 4 నుంచి ప్రారంభించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఏప్రిల్‌ 13 వరకు.. మొత్తం 10 రోజుల్లో జవాబు పత్రాల కరెక్షన్ పూర్తి చేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం వెల్లడించింది. ఏప్రిల్‌ మూడో వారం నాటికి ఫలితాలు వెల్లడించాలని విద్యాశాఖ భావిస్తోంది.