శ్రీచైతన్య విద్యా సంస్థలపై మహిళా కమిషన్ సీరియస్
HYD: బాచుపల్లిలోని శ్రీ చైతన్య కాలేజ్‌లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని వర్షిత ఆత్మహత్య ఘటనపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమీషన్ సుమోటో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కమీషన్, శ్రీ చైతన్య కళాశాలల ఛైర్‌పర్సన్‌ని డిసెంబర్ 10వ తారీఖున వ్యక్తిగతంగా హాజరు కావాల్సినదిగా, నోటీసు జారీ చేయడం జరిగింది.