కేటీఆర్ రాక.. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం
WGL: వర్ధన్నపేట పట్టణానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం రానున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పలు వార్డుల్లో రోడ్ షోలు, సభల్లో పాల్గొని పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నట్లు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తెలిపారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.