తుఫాన్ ఎఫెక్ట్.. రైతుల్లో ఆందోళన

తుఫాన్ ఎఫెక్ట్.. రైతుల్లో ఆందోళన

SKLM: తుఫాను హెచ్చరికల కారణంగా జిల్లా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీంతో ముందుస్తు చర్యగా అన్నదాతలు ఆదివారం వరి పంటకు దిబ్బలు పెట్టడం, మోపులు మోయడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే కొంత పంట కోతలను వాయిదా వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం పంట కోత సమయంలో తుఫానులు రావడం రైతులను భయభ్రాంతికి గురిచేస్తోంది.