సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

NZB: ఆలూరు మండలం కల్లెడ గ్రామంలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ MLA పైడి రాకేష్ రెడ్డికి BJP నాయకుడు ప్రళయ్ తేజ్ వినతి పత్రాన్ని అందజేశారు. ఆలూరు, కల్లెడ, చిన్నాపూర్ గ్రామాల మధ్య ఉన్న రహదారి ఇరుకుగా ఉందని వివరించారు. ఈ మార్గంలో డబుల్ రోడ్డును జాతీయ రహదారి 63 వరకు నిర్మించాలని కోరారు. అలాగే CC రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.