BRS అంటే రేవంత్ రెడ్డికి భయం: హరీష్ రావు
TG: రెండేళ్లుగా గుర్తుకురాని జూబ్లీహిల్స్ అభివృద్ధి ఇప్పుడే రేవంత్ రెడ్డికి గుర్తొచ్చిందా? అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఉపఎన్నిక రాగానే అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చారని, NTR, PJR విగ్రహాలు పెడతామంటున్నారని మండిపడ్డారు. అంత ప్రేమే ఉంటే PJR కొడుక్కే టికెట్ ఇవ్వొచ్చుగా అని నిలదీశారు. కేవలం BRS అంటే భయంతోనే.. రేవంత్ రెడ్డి హామీలు ఇస్తున్నారన్నారు.