ఉగ్రదాడి బాధితులకు కొవ్వొత్తులతో సంతాపం

ఉగ్రదాడి బాధితులకు కొవ్వొత్తులతో సంతాపం

కృష్ణా: నూజివీడు మండలం గొల్లపల్లిలో రెడ్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి కొవ్వొత్తులు వెలిగించి సంతాప కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నూజివీడు ఏరియా సీపీఐ నేత నిమ్మగడ్డ నరసింహ మాట్లాడుతూ.. ఈనెల 22వ తేదీన కాశ్మీర్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 28 మంది మరణించడం బాధాకరమన్నారు. పుణ్యక్షేత్రాలు, సందర్శనీయ స్థలాలలో కేంద్రం పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలన్నారు.