మత్స్యకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
E.G: 'మొంథా' తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న కొవ్వూరు నియోజకవర్గ మత్స్యకారులకు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు నిత్యావసర సరుకులు అందజేశారు. కొవ్వూరు రూరల్, అర్బన్ కలిపి మొత్తం 995 మంది మత్స్యకారులకు ప్రభుత్వం ఈ సరుకులు అందించిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాణి సుస్మిత, మున్సిపల్ ఛైర్ పర్సన్ భావన రత్నకుమారి, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.