కుష్ఠు వ్యాధిపై విద్యార్థులకు అవగాహన
BDK: పినపాక మండలం భూపాలపట్నం ప్రాథమిక పాఠశాలలో హెల్త్ హెచ్‌ఈవో హనుమంతు ఆధ్వర్యంలో కుష్ఠు వ్యాధిపై అవగాహన కల్పించారు. సర్పంచ్ తోలేం స్వప్న ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. శరీరపై రాగి రంగు మచ్చలు ఉండి స్పర్శ లేకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, సకాలంలో చికిత్స పొందితే కుష్టు వ్యాధిని పూర్తిగా నయం చేయాలన్నారు.