ఇకపై స్పర్శ దర్శనానికి ఆన్లైన్ టోకెన్లు

ఇకపై స్పర్శ దర్శనానికి ఆన్లైన్ టోకెన్లు

NDL: శ్రీశైలంలో సామాన్య భక్తుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన మల్లికార్జున స్వామి 'ఉచిత స్పర్శ దర్శనం' టోకెన్ల జారీకి ఆన్లైన్ విధానం ప్రవేశ పెడుతున్నట్లు ఆలయ ఈవో వెల్లడించారు. ఉచిత స్పర్శ దర్శనానికి భక్తుల నుంచి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1.45 గంటల నుంచి 3.45 గంటల వరకు ఉచిత స్పర్శ దర్శనం ఉంటుందన్నారు.