స్కూల్ గ్రాంట్ కింద రూ.1.09 కోట్లు విడుదల

MDK: మెదక్ జిల్లాకు స్కూల్ గ్రాంట్ కింద మొదటి విడతగా 1.09 కోటి రూపాయలు నిధులు విడుదలైనట్లు జిల్లా విద్యాధికారి రాధా కిషన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధానోపాధ్యాయులు, అమ్మ ఆదర్శ కమిటీల సంయుక్త ఖాతాలో నిధులు జమ అవుతాయని చెప్పారు. కమిటీ తీర్మానం మేరకు ఈ నిధులను ఖర్చు చేసుకోవాలని పేర్కొన్నారు.