నేడు పైడిపాలలో టీడీపీ ఎన్నికల శంఖారావం

నేడు పైడిపాలలో టీడీపీ ఎన్నికల శంఖారావం

విశాఖ: మాకవరపాలెం మండలం పైడిపాల గ్రామంలో బుధవారం టీడీపీ ఎన్నికల శంఖారావం సభ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ మండల అధ్యక్షులు ఆర్.వై. పాత్రుడు తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, నర్సీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడు పాల్గొంటారన్నారు. మండలంలోని అన్ని గ్రామాల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.