క్రికెట్ టోర్నీ.. విజేతగా గోదావరిఖని జట్టు
పెద్దపల్లి జిల్లా స్వర్ణకారుల సంఘం తృతీయ వార్షికోత్సవం సందర్భంగా గోదావరిఖని పీజీ కళాశాల మైదానంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్లో పెద్దపల్లి జట్టుపై గోదావరిఖని జట్టు విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.