బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే
NRML: బైంసా పట్టణంలోని సాయి సుప్రియ ఆసుపత్రిలో ఈరోజు ఎమ్మెల్యే రామారావు పటేల్ పలువురిని పరామర్శించారు. ముధోల్, దవునెల్లి, అంబకంటి గ్రామాలకు చెందిన బాధితుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను సూచించారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.