జీబీ రోడ్డుపై ఫ్లై ఓవర్ నిర్మాణానికి ప్రతిపాదన

జీబీ రోడ్డుపై ఫ్లై ఓవర్ నిర్మాణానికి ప్రతిపాదన

GNT: మంగళగిరిలో ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి గౌతమ బుద్ధా రోడ్డుపై ఫ్లై ఓవర్ నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కనీమాత టెంపుల్ నుంచి పాత గ్యాస్ కంపెనీ వరకు ఈ వంతెనను నిర్మించనున్నారు. ఇటీవల జరిగిన ఏడీసీఎల్ సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. నిర్మాణ బాధ్యతలను మెగా సంస్థకు అప్పగించినట్లు తెలుస్తోంది. గురువారం కొలతలు వేసే పనులు జరుగుతున్నాయి.