VIDEO: కన్న తండ్రి వద్ద నాటకీయ కిడ్నాప్.. ఇద్దరు అరెస్ట్

WGL: పట్టణంలోని వాసవి కాలనీకి చెందిన అదిట్ సోని, యాకుబ్ పాషాలు డబ్బు కోసం కన్న తండ్రి వద్ద కిడ్నాప్ అయినట్లు నాటకమాడి రూ.10 లక్షలు డిమాండ్ చేసిన ఘటనలో మట్టెవాడ పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. మంగళవారం వీరి వద్ద నుంచి ఒక ఆటో, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు.