పులివెందులలో ఎంపీ ప్రజా దర్బార్

KDP: పార్లమెంట్ సభ్యుడు YS అవినాష్ రెడ్డి గురువారం తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ మేరకు స్థానిక ప్రజలు, నాయకులు, కార్య కర్తలు ఆయనను కలుసుకుని తమ సమస్యలను వివరించారు. ముఖ్యంగా పెన్షన్ సమస్యలు, రేషన్ కార్డులు, హౌసింగ్ సంబంధిత అంశాలను ప్రజలు వినిపించారు. అనంతరం ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రతి ఒక్కరి సమస్యను శ్రద్ధగా విని, వెంటనే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు.