మృతుని కుటుంబానికి చేయూత

NLR: 108 అంబులెన్స్‌లో EMTగా పనిచేసిన ఓంకారం వెంకట నారాయణ ఆటో ప్రమాదంలో మృతిచెందిన విషయంపై అతని కుటుంబానికి నెల్లూరు జిల్లా 108 ఉద్యోగులు కలిసి గురువారం రూ. 90,000 ఆర్థిక సహాయం అందించారు. ఆయన ఇద్దరు కుమార్తెల కోసం చెరో రూ. 45,000 చొప్పున పోస్ట్ ఆఫీసులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. కుటుంబానికి యూనియన్ పరంగా పూర్తి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు.