అమెరికా గడ్డపై అన్నమయ్య విగ్రహం
అన్నమయ్య: అమెరికా మెమ్ఫిస్ నగరంలో 111 అడుగుల అన్నమయ్య భారీ విగ్రహం కొలువుదీరనుంది. పశ్చిమ గోదావరి జిల్లా నత్తారామేశ్వరానికి చెందిన శిల్పి పెనుగొండ కరుణాకర్ ఈ అద్భుత విగ్రహాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ విగ్రహన్ని 2028 మే 9న ఆవిష్కరించనున్నారు. తెలుగు భాష తియ్యదనం ఖండాంతరాలు దాటుతోందని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.