పొంగిపొర్లుతున్న వాగు

SRD: భారీ వర్షాలకు కొండాపూర్ మండలం తేర్పాల్ వాగు మంగళవారం పొంగిపొర్లుతుంది. ఎంపీడీవో సత్తయ్య వాగును పరిశీలించారు. ఎంపీడీవో మాట్లాడుతూ.. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు సాధ్యమైనంత వరకు ఇండ్లలోనే ఉండాలని చెప్పారు. వాగు వద్దకు ఎవరూ రాకుండా బారికేడ్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట పంచాయతీ సిబ్బంది ఉన్నారు.