VIDEO: యూరియా కోసం ఎరువుల షాపు ఎదుట రైతులు బారులు

WGL: వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఎరువుల షాపుల వద్ద గురువారం యూరియా బస్తాల కోసం రైతులు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో బారులు తీరారు. లారీ లోడ్ యూరియా వచ్చినట్లు తెలియగానే, రైతులు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. మహిళారైతులు సైతం క్యూలైన్లో యూరియాకోసం వేచి ఉండవలసిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. సరిపడా యూరియా అందించాలని రైతులు డిమాండ్ చేశారు.