జిల్లా వ్యాప్తంగా వందేమాతరం ఉత్సవాలు: కలెక్టర్
సత్యసాయి: నేటితో 'వందేమాతరం' రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాదిపాటు జిల్లా వ్యాప్తంగా ఉత్సవాలను నిర్వహించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. నవంబర్ 7, 2025 నుంచి 2026 నవంబర్ 7 వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. గీతం సందేశం, ప్రాధాన్యత ప్రతిబింబించేలా విద్యా, సాంస్కృతిక సంస్థలను భాగస్వామ్యం చేయాలని సూచించారు.