VIDEO: కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై మంత్రి అడ్లూరి ఫైర్
HYD: సీనియర్ నేత కడియం శ్రీహరి మాట్లాడుతుండగా MLA కౌశిక్ రెడ్డి ప్రదర్శించిన తీరుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు. గౌరవప్రదమైన దళిత నాయకుడి పట్ల గుండాగిరి ప్రదర్శించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. గతంలో సంపత్ కుమార్‌పై తీసుకున్న కఠిన చర్యలను గుర్తు చేస్తూ, సభా మర్యాదలను అతిక్రమించిన కౌశిక్ రెడ్డిపై తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.