సర్పంచ్ నుంచి మంత్రి

సర్పంచ్ నుంచి మంత్రి

NZB: కమ్మర్ పల్లి మండలం చౌట్‌పల్లికి చెందిన ఏలేటి మహిపాల్ రెడ్డి 1981లో కోనాపూర్ సర్పంచ్‌గా గెలిచారు. అనంతరం ఆయన భీమ్ గల్ పంచాయతీ సమితి అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. 1983 ఎన్నికల్లో TDP నుంచి ఆర్మూర్ MLAగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 1985లో మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి NTR హయంలో మంత్రివర్గంలో చోటుదక్కించుకున్నారు. అటవీ శాఖ మంత్రిగా పని చేశారు.