'పరిశుభ్రతతోనే ఆరోగ్యం భద్రం'
PPM: ఆరోగ్య అంశాలపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించాలని రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమం జిల్లా అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు సూచించారు. బెలగం, ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బుధవారం ఆయన వైద్య సిబ్బందితో కలిసి సందర్శించారు. తొలుత ప్రధానోపాధ్యాయులతో సమీక్షించి విద్యార్థుల ఆరోగ్య వివరాలు, వైద్య సిబ్బంది చేపడుతున్న హెల్త్ స్క్రీనింగ్ పై తెలుసుకున్నారు.