నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

AKP: ఎస్.రాయవరం మండలం కొరుప్రోలు సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ రాజశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గుడివాడ, రేవుపోలవరం, సోముదేవుపల్లి, లక్ష్మీపతిరాజుపేట, బంగారమ్మపాలెం, వాతాడ పెదఉప్పలం, చినఉప్పలం, గుర్రాజుపేట తదితర గ్రామాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.