పోలీసులకు బీజేపీ నేతల వినతి

NLG: రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, ఇతర రద్దీ ప్రాంతాల్లోనూ, పట్టణ శివారు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని బీజేప నాయకులు మంగళవారం పోలీసులకు వినతి పత్రాన్ని అందించారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు గస్తీ పెంచాలని పట్టణ శాఖ తరపున ఆ పార్టీ నాయకులు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో అందించిన వినతి పత్రంలో పేర్కొన్నారు.