VIDEO: బస్టాండ్‌లో ప్రైవేట్ వాహనాల జోరు
NGKL: ఆర్టీసీ సమ్మెతో బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇవాళ ప్రైవేట్ వాహనాలు జోరుగా నడుస్తున్నాయి. కల్వకుర్తి బస్టాండ్ లోకి ప్రైవేట్ వాహనాలు వెళ్లి ప్రయాణికులను వాహనాలలో ఎక్కించుకుంటున్నారు. కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వరకు రూ.200 ఛార్జ్ వసూలు చేస్తున్నట్లు పలువురు ప్రయాణికులు తెలిపారు.