ఇంద్రకీలాద్రిపై మహా కుంభాభిషేకం.. సీఎం చంద్రబాబు హాజరు
ఎన్టీఆర్: విజయవాడ ఇంద్రకీలాద్రిపై 12 ఏళ్లకోసారి జరిగే మహా కుంభాభిషేక వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం మొదలైన ఈ మూడు రోజుల క్రతువు ఇవాళ్టితో ముగియనుంది. నేడు ప్రధాన ఘట్టం జరగనుంది. ఆలయ విమాన గోపురంపై ఉన్న బంగారు కలశానికి పండితులు మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు.