డాగ్ స్క్వాడ్ తనిఖీలు

JGL: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లిలో డాగ్ స్క్వాడ్, బాంబ్ డిటెక్షన్ టీమ్‌లు మంగళవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించాయి. ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ ఆఫీసులు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాలు, వంతెనలు వంటి చోట్ల బృందాలు క్షుణ్ణంగా తనిఖీ చేశాయి.