సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పోలీసుల అవగాహన

సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పోలీసుల అవగాహన

WGL: సోషల్ మీడియాలో వేధింపులపై మౌనం వీడాలని, ఎవరైనా బెదిరిస్తే భయపడొద్దని WGL సైబర్ పోలీసులు సూచించారు. ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పస్తున్నారు. అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని, వారితో మాటలు కలిపే ముందు ఆలోచించాలన్నారు. ఎవరినీ నమ్మవద్దని, వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలు పంచుకోవద్దని హెచ్చరించారు.