విద్యుత్ షాక్‌కు గురైన కార్మికుడు
ELR: నరసింహారావుపేటలో ఆదివారం విద్యుత్ ఘాతానికి గురై భవప నిర్మాణ కార్మికుడు సకినాల జగదీష్ రామారావు తీవ్రంగా గాయపడ్డాడు. చాటపర్రుకు చెందిన జగదీష్ భవనానికి పరదాలు కడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలాయి. తోటి కూలీలు వెంటనే అతడిని ఏలూరు సర్వజన ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు.