చమురు కొరత.. జపాన్ కీలక నిర్ణయం
యుద్ధం కారణంగా చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో జపాన్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ వద్ద ఉన్న చమురు నిల్వల్లో కొంత భాగాన్ని విడుదల చేస్తామని వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉన్న రిజర్వులను రిలీజ్ చేస్తామని చెప్పింది. MAR-16 కల్లా అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన లభ్యత పెరిగి, ధరల స్థిరీకరణకు దోహదం చేస్తుందని తెలిపింది.