ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెన్‌కాశీలో రెండు బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.