జేపీఎల్–3 క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ ఆవిష్కరణ
MLG: జేపీఎల్-3 మెగా క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్‌ను ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ భానోత్ రవిచందర్ సోమవారం ఆవిష్కరించారు. కోపెల జనార్దన్ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు కోపెల కిరణ్ ప్రసాద్ ఈ టోర్నమెంట్‌ను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. టోర్నమెంట్ విజయవంతం కావాలని రవిచందర్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువకులు పాల్గొన్నారు.