ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

NZB: అతివేగం ఒకరి ప్రాణాన్ని బలిగొన్న సంఘటన భీమగల్ మండలంలో చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి రహత్ నగర్ నుంచి చౌడ తండా వైపు వెళ్తున్న ట్రాక్టర్, ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చౌడ తండాకు చెందిన రామవత్ గోపాల్ (40) తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ తిరుపతి తెలిపారు.