వానతో తడిసిన ధాన్యం.. రైతుల్లో ఆందోళన

GDWL: అయిజ మండలంలోని పులికల్లో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాలు పడటంతో నిల్వ చేసిన ధాన్యం తడిసిపోయింది. ఈదురుగాలులు, వర్షాల ధాటికి రైతులు నష్టపోతున్నారు. వాతావరణం ఒక్కసారిగా చల్లబడటం వల్ల రైతుల్లో ఆందోళన నెలకొంది. వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని వారు అధికారులను కోరుతున్నారు.