VIDEO: ఏఎంఆర్ ఓపెన్ కాస్ట్ వద్ద భూ నిర్వాసితుల ధర్నా
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహర్‌రావు మండలంలోని ఏఎంఆర్ ఓపెన్ కాస్ట్ వద్ద మంగళవారం భూ నిర్వాసితులు బొగ్గు వెలికితీత పనులను అడ్డుకుని ధర్నా చేపట్టారు. డేంజర్ జోన్‌లో ఉన్న గృహాలను స్వాధీనం చేసుకుని న్యాయం చేయాలని, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.