ఉమ్మడి జిల్లా హాకీ బాలికల జట్టు ఎంపిక
నల్గొండ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో ఉమ్మడి జిల్లా బాలికల హాకీ జట్టు ఎంపిక జరిగింది. ఈ కార్యక్రమంలో 200 మంది పాల్గొనగా, ఎంపికైన వారిని జిల్లా పరీక్షల అధికారి యూసఫ్ షరీఫ్ అభినందించారు. రాష్ట్రస్థాయిలో మెరుగైన ప్రతిభ చూపాలని హాకీ అసోసియేషన్ కార్యదర్శి ఇమామ్ కరీం ఆకాంక్షించారు.