VIDEO: సమస్యలు అధికారులకు పట్టవా..?

GDWL: జిల్లాలోని పూడూరులో పలు సమస్యలపై అధికారులు స్పందించడం లేదని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని పంచాయతీ కార్యాలయం పక్కన, ప్రైమరీ స్కూల్ ఎదురుగా ఉన్న ప్రాంతం చెత్తతో నిండిపోయిందని, ఇది విద్యార్థులకు, స్థానికులకు ఇబ్బంది కలిగిస్తోందని శనివారం గ్రామ ప్రజలు తెలిపారు. ఇప్పటికైనా అధికారులకు స్పందించి సమస్యను పరిష్కరిచాలని కోరుతున్నారు.