'పల్లె దవా‌ఖాన ఎప్పుడు ప్రారంభిస్తారు'

'పల్లె దవా‌ఖాన ఎప్పుడు ప్రారంభిస్తారు'

GDWL: గట్టు మండలం మాచర్ల గ్రామంలో పల్లె దవాఖానను వెంటనే ప్రారంభించి, పేద ప్రజలకు వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ సంతోష్, డీఎంహెచ్‌ఓకు వినతిపత్రం భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇన్‌‌ఛార్జ్ మాచర్ల ప్రకాష్ అందజేశారు. మాచర్ల గ్రామంలో పల్లె దవాఖాన భవనం నిర్మాణం పూర్తై రెండేళ్లు అవుతున్నా ఇప్పటికీ ప్రారంభించలేదని ఆయన పేర్కొన్నారు.