రేపు జిల్లాలో కవిత 'జాగృతి జనం బాట'

రేపు జిల్లాలో కవిత 'జాగృతి జనం బాట'

NLG: జాగృతి అధ్యక్షురాలు కవిత రేపు జిల్లాలో పర్యటించనున్నారు. ‘జాగృతి జనం బాట’ కార్యక్రమంలో భాగంగా ఆమె కిష్టారంపల్లి, దేవరకొండ, నక్కలగండి, సుంకిశాల, నెల్లికల్ ప్రాజెక్టులను సందర్శించి ముంపు రైతులతో సమావేశమవుతారు. సాయంత్రం మిర్యాలగూడలో జాగృతిలో చేరిక కార్యక్రమం జరుగనుంది. రైతుల సమస్యలు, అభివృద్ధి అంశాలపై ఈ పర్యటన కొనసాగుతుందని జాగృతి తెలిపింది.