జిల్లా వాసుల మృతి బాధాకరం: మంత్రి

జిల్లా వాసుల మృతి బాధాకరం: మంత్రి

అన్నమయ్య: తమిళనాడులోని తిరుత్తణి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లా వాసులు ముగ్గురు మృతి చెందడం బాధాకరమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాయచోటిలో ఆయన మాట్లాడుతూ.. చికిత్స కోసం చెన్నైలోని ఆసుపత్రికి వెళ్తుండగా ప్రమాదం జరగడం శోచనీయమని అన్నారు. ప్రమాదంపై మంత్రి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.