పంటలను కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన

పంటలను కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన

KRNL: ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో సోమవారం పత్తి గరిష్ఠంగా క్వింటా రూ. 7,491 పలికింది. వేరుశనగ ధర రూ. 6,879 వరకు, ఆముదాలు రూ. 5,861 వరకు నమోదయ్యాయి. అయితే, సీసీఐ (CCI) తేమ శాతం పేరుతో అధికారులు పంటలను కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆదుకోవాలని వారు కోరారు.