గిద్దలూరులో శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే
ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని స్థానిక మార్కెట్ యార్డులో శనగల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి హాజరై శనగల కొనుగోలు కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కొనుగోలు కేంద్రం ద్వారా శనగలు ఒక క్వింటా రూ.5,875గా నిర్ణయించి ఒక రోజుకి 40 క్వింటాలు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.