జీడిమెట్లలో పర్యటించిన BRS ఎమ్మెల్యే
RR: జీడిమెట్ల డివిజన్ పేట్ బషీరాబాద్ రంగారెడ్డి బండ ప్రాంతంలో BRS ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా విద్యుత్ స్తంభాల మార్పు, భూగర్భ డ్రైనేజీ సామర్థ్యం పెంపు, మంజీరా నీటి పెంపు వంటి సమస్యలపై స్థానికులు ఎమ్మెల్యేకు విన్నవించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పనలో భాగంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తామన్నారు.