వివిమెరకలో ఆధార్ కేంద్రం ప్రారంభం

వివిమెరకలో ఆధార్ కేంద్రం ప్రారంభం

కోనసీమ: సఖినేటిపల్లి మండలం వివిమెరక గ్రామ సచివాలయం-2లో కొత్తగా ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ ఓగూరి రత్నకుమారి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలందరూ ఈ ఆధార్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారి అవసరాలు తీర్చేందుకు ఈ ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.