VIDEO: మాదారంలో శాస్త్రోక్తంగా ధ్వజరోహణ కార్యక్రమం

VIDEO: మాదారంలో శాస్త్రోక్తంగా ధ్వజరోహణ కార్యక్రమం

MNCL: తాండూర్ మండలం మాదారం టౌన్‌షిప్‌లోని కోదండ రామాలయంలో శుక్రవారం ఉదయం శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమయ్యాయి. వేద పండితులు ముద్దు అవధూత శర్మ ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యం దంపతులు ధ్వజరోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మధ్యాహ్నం 12:50 గంటలకు అభిజిత్ లగ్న సుముహూర్తమున సీతారామచంద్రుల వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరగనుంది.