ప్రకాశ్‌రాజ్ వ్యాఖ్యలు సిగ్గుచేటు: విష్ణువర్ధన్ రెడ్డి
సత్యసాయి: నటుడు ప్రకాశ్ రాజ్ శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. కదిరిలో ఆయన మాట్లాడుతూ.. కోట్లాది మంది ఆరాధించే దేవుడిని అవమానించి, ఆపై మీడియా వక్రీకరించిందని సాకులు చెప్పడం ఆయనకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. హిందూ మతం, సంస్కృతిపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.