VIDEO: కంభం‌లో ఘనంగా కోటి దీపోత్సవం

VIDEO: కంభం‌లో ఘనంగా కోటి దీపోత్సవం

ప్రకాశం: కంభంలోని శ్రీ కోట సత్యమాంబ ఆలయంలో కోటి దీపోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తులు దీపాలు వెలిగించి శివ నామస్మరణతో భక్తిని చాటారు. ప్రతి సంవత్సరం ఆలయంలో కార్తీకమాసాన్ని పురస్కరించుకుని కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. ముందుగా ఆలయంలోని కోట సత్యమాంబా దేవిని దర్శించుకుని భక్తులు కోటి దీపోత్సవంలో పాల్గొన్నారు.